Atlee Kumar | పెళ్ళయిన 8ఏళ్ళకు తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్..!
తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా అట్లీ కుమార్, నటి కృష్ణ ప్రియను 2014లో ప్రేమ వివాహాం చేసుకున్నాడు. పెళ్ళయిన 8ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.
Directo Atlee Kumar | తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా అట్లీ కుమార్, నటి కృష్ణ ప్రియను 2014లో ప్రేమ వివాహాం చేసుకున్నాడు. పెళ్ళయిన 8ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో బేబి బంప్‌తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. మేము ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ చేశారు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించి ఈ సెలబ్రెటీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఏ.ఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అట్లీ.. ఆయన నిర్మాణ సంస్థలోనే తన మొదటి చిత్రాన్ని (రాజారాణి) తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్‌తో ‘తేరీ’ మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. వీటి తర్వాత వరుసగా విజయ్‌తోనే ‘మెర్సల్’, ‘బిగిల్’ సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ కానుంది. ఇక ఆయన భార్య ప్రియా కూడా పలు తమిళ సినిమాల్లో నటిగా మెరిసింది. డబ్బింగ్ సినిమాలు ‘నా పేరు శివ’, ‘యముడు’ వంటి చిత్రాల్లో ఆమె నటించింది.
Happy to announce that we are pregnant need all your blessing and love ❤️❤️
Wit love
Atlee & @priyaatleePc by @mommyshotsbyamrita pic.twitter.com/9br2K6ts77
— atlee (@Atlee_dir) December 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

