‘కాలింగ్ అనేది కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు. ఈ రెండూ ఈ కథలో కీలకం. అందుకే ఈ సినిమాకు‘కాలింగ్ సహస్ర’ అనే పేరు పెట్టాం’ అని దర్శకుడు అరుణ్ విక్కిరాలా అన్నారు. ఆయన దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్బంగా దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ మీరు చూసిన సుధీర్ వేరు. ఈ సినిమాలో మీకు కనిపించే సుధీర్ వేరు. ఇందులో నవ్వించే సుధీర్ కనిపించడు. వీడు ఇంకో రకం’ అని అరుణ్ అన్నారు. ‘గూఢచారి’ టైమ్లో అడివి శేషుకి ఈ కథ చెప్పానని, ఆయనతో చేయాల్సిన ఈ కథ చివరికి సుధీర్ దగ్గరకు చేరిందని, అనుకున్నదానికంటే అద్భుతంగా చేశాడని ఆయన అన్నారు. మేం ‘యానిమల్’కి పోటీగా రావడంలేదని, ‘యానిమల్’తోపాటు వస్తున్నామని, మా సినిమాను కూడా దీవిస్తారని నమ్మకమని దర్శకుడు అరుణ్ విక్కిరాలా ఆకాంక్షించారు.