రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ ఉపశీర్షిక. రామకృష్ణ వట్టికూటి దర్శకుడు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. యువ దర్శకుడు వశిష్ట ట్రైలర్‌ను లాంచ్ చేశారు. నిజ జీవిత సంఘటనలతో తీసిన క్రైమ్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు రామకృష్ణ వట్టికూటి తెలిపారు.
ఈ కథకు టైటిల్ పర్ఫెక్ట్గా కుదిరిందని, అన్ని అవరోధాలను దాటుకొని ఓ వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నామని నిర్మాతలు అన్నారు. జెమినీ సురేష్, గోవింద్శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంకీ వీణ, నిర్మాతలు: మల్లిఖార్జున ఎలికా, అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల, దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.