నూతన నిర్మాణ సంస్థ జ్యాపి స్టూడియోస్ బ్యానర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఉదయ్కోలా, విజయ్శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి ఈ చిత్ర నిర్మాణ సంస్థను ఆరంభించారు. జ్యాపి స్టూడియోస్ బ్యానర్, పోస్టర్ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు.
ఈ బ్యానర్లో నాలుగు చిత్రాల్ని ప్రకటించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ‘జగమే మాయ’ పోస్టర్ను నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సంస్థపై రాజ్ తరుణ్ కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కనుంది. సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందించనున్న ప్రొడక్షన్ నెం 4 పోస్టర్ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ట లాంచ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘2019లో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టాం. ఇండస్ట్రీపై అవగాహను పెంచుకున్న తర్వాత సినిమా డిజిటల్ ప్రమోషన్స్ కూడా చేశాం. ఇప్పుడు నిర్మాణ సంస్థతో మీ మందుకొస్తున్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్ తరుణ్, సుహాస్, కె.ఎల్.దామోదరప్రసాద్, ధన్యబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.