‘పుష్ప’ చిత్రంతో కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న అల్లు అర్జున్ త్వరలో ‘పుష్ప-2’ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. తాజాగా ఆయన మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. ైస్టెలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలిసింది.