Dimple Hayathi | టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi), ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా సెల్లార్‌లోని పార్కింగ్ ప్లేస్ విషయంలో డింపుల్ హయతికి, డీసీపీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.చేతన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది.
డీసీపీ కారుపై దాడికి పాల్పడటానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చినప్పటికీ ఈ ఘటనలో తన తప్పేమీ లేదని డింపుల్ హయతి వాదిస్తోంది. అంతేకాదు న్యాయపోరాటం కోసం కోర్టును కూడా ఆశ్రయించింది. ఇదిలా ఉంటే డింపుల్ హయతి ఓ విషయంలో చాలా అప్సెట్ అవుతుందన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ విషయమేంటనే కదా మీ డౌటు. ఈ వివాదంలో డింపుల్ ఫ్రెండ్ విక్టర్ డేవిడ్ (Victor David) పేరు కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విక్టర్ డేవిడ్‌కు సంబంధించిన విషయాలు లీక్ అవడమే డింపుల్ అప్సెట్ అవడానికి కారణమని టాక్ నడుస్తోంది.
డింపుల్ హయతి స్వస్థలం విజయవాడ అని తెలిసిందే. విక్టర్ డేవిడ్ కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అని పోలీస్ కంప్లెయింట్ ద్వారా లీక్ అవడంతో.. డింపుల్ చాలా కాలంగా డేవిడ్‌తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్లు గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ లీక్‌తో డింపుల్ అప్సెట్ మూడ్‌లో ఉందట.
విక్టర్ డేవిడ్ గ్రాఫిక్ డిజైనర్ కాగా.. క్రిస్టియన్ మిషనరీస్‌కు సంబంధించి చాలా కవర్ పేజీలను డిజైన్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఇటీవలే గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాతో ప్రేక్షకులను పలుకరించింది డింపుల్ హయతి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని టాక్ మూటగట్టుకుంది. డింపుల్ మరే కొత్త సినిమా ప్రకటించలేదు.