Dimple hayathi | మాస్‌రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ రావు నిర్మించాడు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. పోటిగా డిజే టిల్లు సినిమా ఉండటంతో ఖిలాడి చిత్ర కలెక్షన్లకు పెద్ద దెబ్బ పడింది. టాక్ విషయం పక్కన పెడితో ఇందులో హీరోయిన్లుగా నటించిన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఒకరనిమించి ఒకరు గ్లామర్‌షో చేశారు.ఈ క్రమంలో డింపుల్ హయతికి బంపర్ ఆఫర్ తగిలింది. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
మ్యాచోస్టార్ గోపిచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రం అనంతరం గోపిచంద్ శీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్సన్లను సాధించి బ్లాక్‌బస్టర్ హిట్లను సాధించాయి. మరో సారి విళ్లీద్దరూ కలిసి హ్యట్రిక్ను సాధించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న చిత్ర బృందం ఈ చిత్రంలో హీరోయిన్గా డింపుల్ హయతిని ఎంపిక చేశారని సమాచారం. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.