F4 | వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్-2’ ‘ఎఫ్-3’ చిత్రాలు హోల్సమ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. ‘ఎఫ్-3’ విడుదల అనంతరం ఈ సినిమా ఫ్రాంఛైజీని కొనసాగిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ నేపథ్యంలో ‘ఎఫ్-4’ ఎప్పుడు పట్టాలెక్కుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు రంగం సిద్ధమైనట్లుగా తెలిసింది. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్‌తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.