టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేయనుంది. ఈ చిత్రానికి రౌడీ బాయ్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. హుషారు ఫేం హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ ప్రాజెక్టులో అనుపమ పరమేశ్వరన్ పీమేల్ లీడ్ రోల్ చేస్తుంది.
రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..మధీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు గ్లింప్స్ వీడియో ద్వారా తెలుస్తాయేమో చూడాలి.