Barabar Premistha | పాపులర్ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ (ChandraHass) రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా చంద్రహాస్ రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. చంద్రహాస్ టీంకు ప్రముఖ దిల్ రాజు సపోర్టుగా నిలిచాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రెడ్డీ మామ సాంగ్‌ను దిల్ రాజు లాంచ్ చేశారు. మాస్ అప్పీల్‌తో సాగే ఈ ఫోక్ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు టీజర్ చెబుతోంది. తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ మూవీలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.
🎶🔥 Groove to the beats of the ultimate mass folk song
Packed with energy, tradition, and unforgettable rhythm, this one’s sure to make you dance and sing along
Star Producer #DilRaju Garu launched first single #ReddyMama 💃🕺 from Attitude Star #ChandraHass ‘s Rustic Love &… pic.twitter.com/CVUCWpzFzC
— BA Raju’s Team (@baraju_SuperHit) February 22, 2025