అగ్ర నిర్మాత దిల్‌రాజు ‘అర్జున’ పేరుతో ఓ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారట. ఇప్పుడు దీనిమీద సోషల్‌మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ టైటిల్ రిజిస్టర్ చేసింది ఏ హీరో కోసం? అనే ప్రశ్న ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ చర్చకు దారి తీసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్ కోసం దిల్‌రాజు ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. పవన్‌కల్యాణ్‌తో తన సంస్థలో ఇప్పటికే ‘వకీల్‌సాబ్’వంటి హిట్ చిత్రాన్ని తీశారు దిల్‌రాజు. పవన్‌కల్యాణ్‌తో మరో సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, సరైన సమయంలో ఆ వివరాల్ని వెల్లడిస్తానని దిల్‌రాజు ఓ సందర్భంలో చెప్పారు.
దాంతో ‘అర్జున’ టైటిల్ పవన్‌కల్యాణ్ కోసమనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మైథాలజీ టచ్ ఉన్న సోషల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారనేది ఇన్సైడ్ టాక్. అయితే ఈ విషయంలో స్పష్టత రావాలంటే దిల్‌రాజు సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మరోవైపు పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు రెండు చిత్రాలను చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట పవన్‌కల్యాణ్. ఆయన అభిమానులు కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు.