Dilraju Love Story | టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకడు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్‌రాజు అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి వెళ్లాడు. ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ, గత మూడేళ్ల కిందట బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దిల్‌రాజు దాదాపు అరడజనకు పైగా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే ఆయన నిర్మించిన వారసుడు విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపుతుంది. దీనితో పాటుగా రామ్‌చరణ్-శంకర్ కాంబోలో ఆర్సీ15 రూపొందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా దిల్‌రాజు, ఆయన సతీమణితో కలిసి ఓ ఇంటర్వూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వూలో తన లవ్‌స్టోరీని పంచుకున్నాడు. తన మొదటి భార్య అనిత మరణించిన తర్వాత రెండేళ్ళు కష్టాన్ని అనుభవించానని, అప్పటికి తన వయసు 47ఏళ్లని తెలిపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అర్థం చేసుకునే మనిషి కావాలనుకున్నట్లు, ఆ సమయంలోనే తేజస్వినితో పరిచయం అయినట్లు వెల్లడించాడు. అప్పుడే తన ఫోన్ నెంబర్ తీసుకుని ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి, పెళ్ళి చేసుకున్నా అంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు.
అలాగే తేజస్విని కూడా దిల్‌రాజుతో పరిచయం గురించి చెప్పింది. తను ఎయిర్ లైన్స్‌లో పనిచేస్తున్న సమయంలో, దిల్‌రాజు రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేవారని చెప్పింది. మొదటిసారి తనని కలిసినప్పుడు దిల్ పెన్నును అడిగారని, ఆ తర్వాత తను షిఫ్ట్‌లో ఉన్న ప్రతీసారి విమానంలో కనిపించేవారని చెప్పుకొచ్చింది. అయితే యాదృచ్ఛికంగానే తాము కలిసేవారని ఈ జంట చెప్పొకొచ్చారు . ఇక వీరిద్దరికి ఓ బాబు ఉన్నాడు.