రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తిరగబడరసామీ’. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో హీరో రాజ్‌తరుణ్ తొలుత అమాయకమైన యువకుడిగా కనిపిస్తాడు. హింసకు దూరంగా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో అతను అన్యాయాలపై తిరగబడాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే కథ ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమాతో రాజ్‌తరుణ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు’ అన్నారు.
‘ఈ సినిమాలో దర్శకుడు రవికుమార్ చౌదరి నన్ను కొత్త కోణంలో చూపించాడు. సైలెంట్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా వయొలెంట్‌గా మారితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది’ అని హీరో రాజ్‌తరుణ్ తెలిపారు. ఈ సినిమాలో రాజ్‌తరుణ్ పరిణితి కలిగిన పాత్రలో నటించాడని, సాంకేతికంగా కూడా అన్ని అంశాల్లో ఉన్నతంగా ఉంటుందని నిర్మాత శివ కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, సంగీతం: జేబీ, మాటలు: భాష్యశ్రీ, రచన-దర్శకత్వం: ఏ.ఎస్.రవికుమార్ చౌదరి.