Dil Raju | ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ తల్లులకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు, క్రీడా కారులు సైతం తమ తల్లలుకి విషెస్ తెలియజేస్తున్నారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడాతో సహా అనేక దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. 1908లో అమెరికన్ కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి దాతృత్వ ప్రయత్నాల నుండి ప్రేరణ పొంది, మొదటి మదర్స్ డే వేడుకను నిర్వహించినప్పుడు ఈ సంప్రదాయం మొదలైంది. అప్పటి నుండి, ప్రతిచోటా తల్లుల అపారమైన ప్రేమ, బలం, త్యాగం గురించి జరుపుకోవడానికి ఇది ఒక ప్రత్యేక సందర్భంగా మారింది అని చెప్పాలి.
ప్రముఖ సెలబ్రిటీలందరు కూడా తమ తల్లులతో దిగిన ఫొటోస్ని షేర్ చేస్తూ వారికి విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు కూతురు చనిపోయిన తన తల్లికి విగ్రహం చేయించి ఇంట్లో పెట్టుకొని ఆ విగ్రహంతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. అమ్మ అనిత అంటే హన్షితకు ఎంత ప్రేమ అంటే… ఏకంగా ఇంట్లో విగ్రహం పెట్టే అంత అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. . ఫోటోలో హన్షిత కుమార్తె, దిల్ రాజు మనవరాలిని కూడా చూడొచ్చు. కాగా, దిల్ రాజు మొదటి భార్య అనిత కొన్నాళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి హర్షితా రెడ్డి తన తల్లి జ్ఞాపకాలలోనే బ్రతుకుతుంది.
అనిత మరణించిన కొద్ది రోజులకి దిల్ రాజు నిరాడంబరంగా తన రెండో వివాహాన్ని చేసుకొన్నారు. కరోనా లాక్డౌన్ పరిస్థితులు కావడంతో అతి తక్కువ మందే ఈ పెళ్లికి హాజరయ్యారు. మొదటి భార్య అనిత మరణాంతరం ఆయన ఒంటరిగా ఉంటున్నతనకి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన పెళ్లికి సిద్ధమైనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దిల్ రాజు వివాహం చేసుకొన్న అమ్మాయి అసలు పేరు వైఘారెడ్డి. అయితే ఇద్దరి జాతకాలను బట్టి వధువు పేరును తేజస్వినిగా మార్చుకొన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైఘారెడ్డి దిల్ రాజు కుటుంబంలోని అతి దగ్గరి ఫ్యామిలీకి చెందిన వారుగా చెప్పారు. ఈ దంపతులకి కొడుకు జన్మించగా, ఆ బుడతడి ఫోటోలు అప్పుడప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంటాయి.