Animal Movie | ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై సినీ లవర్స్‌లో ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కే అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి.. అసలు బార్డర్లు లేని బాలీవుడ్లో యానిమల్తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని అందరిలోనూ తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రీ టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్‌ను గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు ఇప్పటికీ రణ్‌బీర్ ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ప్రీ టీజరే ఈ లెవల్లో ఉంటే టీజర్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అని అప్పుడే విజువలైజ్ చేసుకుంటున్నారు.
దానికి తోడు బ్యాక్ టు బ్యాక్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు బిజినెస్ పూర్తయిందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా తెలుగు హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నాడు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.15 కోట్లు పెట్టి రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా ఇక్కడ హిట్టవ్వాలంటే పాతిక కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సినిమా హైప్ చూస్తుంటే ఈ నెంబర్‌ను ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ చేసే చాన్స్ లేకపోలేదు. పైగా అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు.
రివేంజ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇన్సైడ్ టాక్. రష్మిక మందన్నా, అనీల్ కపూర్, బాబీ డియోల్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉంది. కాగా ముందుగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. వీఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్‌కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఎలాగో రిలీజ్‌కింకా టైమ్ ఉంది కనుక ఎడిటింగ్ రూమ్‌లో ఎక్కువ కసరత్తులే చేస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.