ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్‌కుమార్, అలేఖ్య రెడ్డి జంటగా నటిస్తున్నారు. అశోక్‌కుమార్, కృష్ణారెడ్డి నిర్మాతలు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు ఆర్.కె.గౌడ్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సినిమా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయి. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించగలమనే స్ఫూర్తివంతమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథాగుణంగా మంచి పాటలు కుదిరాయి’ అన్నారు. సవాలుతో కూడిన పాత్రలు చేయడం ఆనందంగా ఉందని నాయకానాయికలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.