సినిమా పరిశ్రమలో రూమర్లు సర్వ సాధారణం. ఈ మధ్య రూమర్లు ఎక్కువైన నేపథ్యంలో వాటి మధ్య నిజాలు వినిపించినా వాటిని రూమర్లుగానే పరిగణిస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం ఓ వార్త సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. అదేంటంటే.. రణబీర్‌కపూర్ హీరోగా నితీష్ తివారీ తీస్తున్న ‘రామాయణం’లో ముందు రాముడిగా అనుకున్నది మన మహేష్‌బాబు నట. మహేష్ కూడా ఈ సినిమా చేసేందుకు మొదట్లో ఉత్సాహం చూపించారట.
కానీ అదే సమయంలో ఆయన రాజమౌళి సినిమాను అంగీకరించడం, దాంతో ‘రామాయణం’కి కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి రావడంతో నితీష్జీ ఆఫర్‌ని మహేష్ సున్నితంగా తిరస్కరించారనేది ఈ వార్త సారాంశం. ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ, వినడానికి మాత్రం బావుంది. నిజంగా రాముడిగా మహేష్ చూడచక్కగా ఉంటారు. నటుడిగా, స్టార్‌గా కూడా ఆయన స్థాయిని పెంచే పాత్ర శ్రీరాముడి పాత్ర. అలాంటి గొప్ప పాత్రను రాజమౌళి సినిమా కోసం మహేష్ త్యాగం చేశాడనే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నది.