సోమవారం సాయంత్రం సోషల్ మీడియా అంతటా ఓ షాకింగ్ రూమర్ వైరల్ అయ్యింది. ‘సినీనటి కాజల్‌కు యాక్సిడెంట్.. పరిస్థితి విషమం..’ అనేది ఆ రూమర్ సారాంశం. ఈ వార్త చూసి నమ్మేసిన కొందరు నెటిజన్లు, ఆందోళనతో కాజల్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దాంతో కాజల్ స్పందిస్తూ.. ‘నా ఆరోగ్యం విషమంగా ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి అసలు ‘నేను లేను’ అంటూ కూడా పోస్టులు పెట్టేస్తున్నారు.
వాటిని చూసి నవ్వుకున్నాను. ఎందుకంటే అంతకు మించిన ఫన్నీ న్యూస్ వేరొకటి ఉండదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరూ నమ్మొద్దు. అవన్నీ అవాస్తవాలు. దేవుడి దయవల్ల నేను క్షేమంగా.. సురక్షితంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయకండి ప్లీజ్’ అంటూ వాపోయారు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ‘రామాయణ’లో మండోదరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ‘ఇండియన్ 3’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.