Shararat Song | బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రూ.700 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలోని ‘శరారత్’ (Shararat) అనే సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ పాటపై పలువురు ప్రముఖులు రీల్స్ చేస్తుండగా.. తాజాగా ఈ పాటకు ‘అనుపమ’ ఫేమ్ నటి రూపాలీ గంగూలీ తల్లి చేసిన డ్యాన్స్ నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రూపాలీ గంగూలీ సోదరుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఆయన తన 70 ఏళ్ల తల్లి రాజనీ గంగూలీతో కలిసి ‘శరారత్’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. 70 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా, కాన్ఫిడెన్స్‌తో డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ వీడియో ఫుల్ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన రణవీర్ సింగ్ ఫిదా అయిపోయారు. వీడియోపై స్పందిస్తూ.. అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేశాడు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ కూడా “బెస్ట్.. బెస్ట్.. బెస్ట్” అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.