Dhurandhar 2 | భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయం రాస్తూ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అరుదైన మైలురాయిని చేరుకుని చర్చనీయాంశమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 దాదాపు రూ.1,810 కోట్ల వసూళ్లతో ఇన్నాళ్లుగా రికార్డుల రారాజుగా నిలిచింది. అయితే ఇప్పుడు ధురంధర్ 2 ఆ రికార్డును అధిగమించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,812 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ‘బాహుబలి 2’ను వెనక్కు నెట్టింది.
ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో దంగల్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, ధురంధర్ 2 రెండో స్థానానికి చేరుకుంది. ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ముందున్నవి చూస్తే.. అందులో దంగల్ – రూ.2,000 కోట్లకు పైగా
ధురంధర్ 2 – రూ.1,812 కోట్లు (ఇంకా ప్రదర్శించబడుతూనే ఉంది), బాహుబలి 2 – రూ.1,810 కోట్లు, పుష్ప 2 – రూ.1,742 కోట్లు, ఆర్ఆర్ఆర్ – రూ.1,300 కోట్లు వసూళ్లు సాధించాయి. అయితే ధురంధర్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశం, విదేశీ మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి అద్భుత స్పందన లభిస్తోంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి ప్రముఖులు నటించారు. అధిక బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం కథ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇంకా థియేటర్లలో బలంగా కొనసాగుతున్న ధురంధర్ 2 వసూళ్లు ఇదే వేగంతో కొనసాగితే, త్వరలోనే దంగల్ రికార్డును కూడా సవాల్ చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.