Dhurandar 2 | ‘ధురంధర్ 2’ ఓటీటీ పార్ట్నర్ మార్పుకి కారణం ఏంటి… జియో హాట్‌స్టార్‌తో సీక్వెల్ స్ట్రీమింగా!
Dhurandar 2 |బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, ఓటీటీ వేదికలపై కూడా మంచి వ్యూయర్షిప్ సాధించింది. ఈ విజయోత్సాహంలోనే ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ‘ధురంధర్ 2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
Dhurandar 2 |బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సృష్టించిన సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా, ఓటీటీ వేదికలపై కూడా మంచి వ్యూయర్షిప్ సాధించింది. ఈ విజయోత్సాహంలోనే ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ‘ధురంధర్ 2’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక పోస్టర్ విడుదల కావడంతో పాటు ఓ కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ‘ధురంధర్ 2’ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తొలి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, సీక్వెల్‌కు మాత్రం ఓటీటీ పార్ట్నర్ మార్పు ఎందుకు జరిగిందనే అంశంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. భారీ డీల్, గ్లోబల్ రీచ్, మార్కెటింగ్ స్ట్రాటజీ వంటి కారణాల వల్ల ఈ మార్పు జరిగి ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీక్వెల్ పోస్టర్లో చూపించిన యాక్షన్ టోన్, డార్క్ థీమ్ ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ రేపుతోంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది.. సోషల్ మీడియాలో ఇప్పటికే #Dhurandhar2 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రామ్‌పాల్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగం కంటే ఈసారి కథ మరింత థ్రిల్లింగ్‌గా, యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
మార్చి 19న ‘ధురంధర్ 2’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా భారీ రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ‘ధురంధర్ 2’ ఓటీటీ పార్ట్నర్ మార్పు నుంచి టీజర్ అంచనాల వరకు ప్రతి అంశం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. యాక్షన్, స్పై, స్టార్ పవర్ కలయికతో ఈ సీక్వెల్ మరో సంచలనాన్ని సృష్టించడానికి రెడీ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

