Dhruv Vikram to Star in Bollywood Hit ‘Kill’ Remake | తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే అతడు నటిస్తున్న బైసన్ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. గతేడాది బాలీవుడ్ నుంచి చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం కిల్ (Kill Movie).
బాలీవుడ్ యువ నటులు లక్ష్య లాల్వానీ (Lakshya), తాన్య మనక్తిలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal) ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించగా.. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం జులై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సినిమాలోని ఫైట్ సీన్స్‌కు అయితే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు.
అయితే ఈ సినిమాను ధ్రువ్ విక్రమ్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఏ స్టూడియోస్ లిమిటెడ్, హవిష్ ప్రోడక్షన్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతున్నట్లు టాక్.