అగ్ర హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బైసన్’. మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ నిర్మాత బాలాజీ ఉభయ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. 1990 పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో కబడ్డీ నేపథ్యంలో ట్రైలర్ రా అండ్ రస్టిక్‌గా సాగింది.
తండ్రీకొడుకుల అనుబంధం, ఊరి రాజకీయాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. కథానాయిక అనుపమపరమేశ్వరన్ లవ్‌ట్రాక్ ఆకట్టుకుంది. క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని నిర్మాత బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కే ప్రసన్న, నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్, దర్శకత్వం: మారి సెల్వరాజ్.