Dhootha Web-Series | చందూ ముండేటితో చేయబోయే సినిమా కోసం నాగ చైతన్య కాస్త ఎక్కువే కష్టపడుతున్నాడు. ప్రత్యేకించి జాలర్లుతో మాట్లాడటం, బోట్ శిక్షణ వంటివి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య ధూత అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. కొన్ని నెలల కిందటే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. అయితే కొంత కాలంగా ఈ వెబ్ సిరీస్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అసలీ ప్రాజెక్ట్ ఉందా అనే సందేహం కూడా చాలా మంది సినీ లవర్స్‌లో ఉంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ హార్రర్ జానర్లో తెరకెక్కుతుంది.
తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎట్టకేలకు ధూత వెబ్ సిరీస్‌కు మోక్షం కలిగింది. అక్టోబర్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇన్సైడ్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయిపోయాయట. ఇక దీనిపై ప్రైమ్ సంస్థ రానున్న రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లు సమాచారం. సూపర్ నాచ్యురల్ పవర్స్ నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి అమెజాన్ ఒరిజినల్స్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మింది. ఇందులో మలయాళ భామ పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.