LGM Trailer | స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner) ను షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఎల్జీఎం (Lets Get Married). ఈ చిత్రంలో లవ్‌టుడే ఫేం ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ (LGM Trailer)ను మేకర్స్ లాంఛ్ చేశారు.
మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్.. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అలా ఉండటం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు గౌతమ్. మరి ఇవానా కాబోయే అత్తమ్మతో సౌకర్యవంతంగా ఫీలవుతుందా..? లేదా..? ఆ తర్వాత జరిగే కథేంటనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు డైరెక్టర్.
ఎల్జీఎం ట్రైలర్..
లవ్‌టుడే సినిమాతో అందరి మనసు దోచేసిన ఇవానా ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచేసుకోవడం గ్యారంటీ అని అర్థమవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఎల్జీఎంలో హరీష్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో కూడా విడుదల చేయనున్నారని సమాచారం.
ధోనీ ఎంటర్టైన్ మెంట్ తమిళంతోపాటు ఇతర భాషల్లో సైన్స్ ఫిక్షన్, కామెడీ డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌తోపాటు పలు జోనర్లలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ ప్రాజెక్ట్‌లు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పలువురు డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లతో సంప్రదింపులు కూడా షురూ చేసింది.
Cricketing Legend @msdhoni and his wife @SaakshiSRawat are here in Chennai for the Trailer and audio of their home production #LGM today pic.twitter.com/4TfRKhObWk
— Ramesh Bala (@rameshlaus) July 10, 2023
ఎల్జీఎం తెలుగు టీజర్..