మంచు విష్ణు కెరీర్లోనే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఢీ’ చిత్రం ఈ నెల 6న రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్ పాత్రలు పండించిన హాస్యం గుర్తుండిపోయింది.
ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో ‘ఢీ’ చిత్రాన్ని మరలా ప్రేక్షకులు ముందుకుతీసుకొస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. మరోవైపు మంచు విష్ణు నటించిన తాజా భక్తిరస చిత్రం ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.