ముంబై : బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ ధర్మేంద్ర(Dharmendra) ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. పూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్, షోలే, కామోషీ, జానీ గద్దార్ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర ఆస్తుల విలువ సుమారు 335 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ధర్మేంద్రను ముద్దుగా హీమ్యాన్, గరమ్ ధరమ్ అని కూడా పిలుస్తుంటారు. సినీ రంగంలో పాపులర్ అయిన తర్వాత ఆయన హోటల్, హాస్పిటాలిటి రంగాల్లోనూ ప్రవేశించారు.
2015లో ఢిల్లీలో గరమ్ దరమ్ దాబాతో ఆయన రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. 2022లో హీమ్యాన్ అనే పేరుతో మరో హోటల్‌ను ప్రారంభించాడు. కర్నాల్ హైవేలో దీన్ని స్టార్ట్ చేశారు. ధర్మేంద్రకు వంద ఎకరాల ఫామ్ హౌజ్ ఉన్నది. ఆయన ఎక్కువ శాతం తన ఫ్యామిలీతో ముంబైలో జీవించారు. అయితే లోనావాలాలో 100 ఎకరాల ఫామ్ హౌజ్ ఉన్నది. ఆయన ఇంట్లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్‌లో ఆయన తరుచూ అక్వా థెరపీ చేయించుకునేవారు.
మహారాష్ట్రలో ధర్మేంద్రకు సుమారు 17 కోట్ల విలువైన ప్రాపర్టీలు ఉన్నాయి. ఆయనకు 88 లక్షల ఖరీదైన వ్యవసాయ భూమి, 52 లక్షల ఖరీదైన నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నది. లోనావాలా ఫార్మౌజ్ వద్ద మరో రిసార్టును ఓపెన్ చేయాలని ధర్మేంద్ర ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. 30 కాటేజీలు ఉన్న రిసార్టును నిర్మించేందుకు ఓ ప్రముఖ రెస్టారెంట్ కంపెనీతో గతంలో ధర్మేంద్ర డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ధర్మేంద్రకు లగ్జరీ కార్లు అంటే ఇష్టం. ఆయన వద్ద చాలా కలెక్షన్ ఉన్నది. వింటేజ్ ఫియల్ కారుతో పాటు ఆధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. 85 లక్షల ఖరీదైన రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడీజ్ బెంజ్ ఎస్ఎల్500 లాంటి కార్లు అతని గ్యారేజీలో ఉన్నాయి. నటనతోనే కాదు ధర్మేంద్ర ఓ ప్రొడ్యూసర్ కూడా రాణించారు. 1983లో ఆయన విజేతా ఫిల్మ్స్ బ్యానర్‌ను స్థాపించారు. 1983లో సన్నీ డియోల్‌తో బేతాబ్, 1995లో బాబీ డియోల్‌తో బర్సాత్ చిత్రాలను రిలీజ్ చేశారు. 2019లో ధర్మేంద్ర మనువడు కరణ్ డియోల్ నటించిన పల్ పల్ దిల్ కే పాస్ రిలీజైంది.