సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్‌సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. నటీనటులంతా ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందం వెలిబుచ్చారు. అన్ని వర్గాలకూ నచ్చే ఓ మంచి కథతో థియేటర్లలోకి రాబోతున్నామని దర్శకుడు జై జ్ఞానప్రభ తోట నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత మేరుం భాస్కర్, పీవీఆర్ సినిమాస్ ప్రతినిధి ఉదయ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: అస్లాం, కెమెరా: వెంకట హనుమ, సంగీతం: మహావీర్ ఎల్లంధర్.