Dhanya Balakrishnan | సినిమా ఇండ్రస్ట్రీలోకి అమ్మాయిలు రావడంపై ఆసక్తికర విషయాలను పంచుకుంటి నటి ధన్య బాలకృష్ణన్. ఆమె కీలక పాత్రలో వస్తున్న తాజా చిత్రం బాపు (Bapu) ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ.. అనేది ఉపశీర్షిక. సీనియర్ నటులు బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకు దయా దర్శకత్వం వహిస్తుండగా.. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న (Bapu Movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్.
అయితే ఈ వేడుకలో ధన్య మాట్లాడుతూ.. బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడూ నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉందని చెప్పాడు ఈ సినిమా చేసినందుకు. సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు అనేది దాని ఆత్మ. అందుకు పల్లెటూరు మీద వచ్చే సినిమాలలో ఒక ఆత్మ దాగి ఉంటుంది. అందుకే మా నాన్న చెబుతుండేవాడు. ఎప్పటికి ఒక పల్లెటూరు కథ చేయమని.. ఇన్ని రోజులకు ఆ కల నేరవేరింది. ముందుగా నేను నటి అవుదాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మా నాన్న ఒకే చెప్పినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయిలను పంపించడం అనేది చాలా పెద్ద విషయం. ఇండియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు. మేము IAS, IPS పాస్ అవ్వొచ్చు కానీ.. అమ్మ నాన్నల్ని ఒప్పించడం వాళ్ళ చుట్టాలు ఉన్న వాళ్ళని ఒప్పించడం అనేది చాలాకష్టం. అలాంటి పరిస్థితుల్లో నాన్న నన్ను నమ్మాడు. నేను ఇండ్రస్ట్రీకి వెళ్లిన అనంతరం కూడా ఎప్పుడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి అని అడుగలేదు. అలాంటి ఫ్యామిలీకి అలాంటి నాన్నకి పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంటూ ధన్య చెప్పుకోచ్చింది.