ధన్యబాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హత్య’. శ్రీవిద్యా బసవ దర్శకురాలు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
హత్యా రహస్యం చుట్టూ అల్లుకున్న ఈ కథ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని..సుధ, సలీమా పాత్రల్లో ధన్యబాలకృష్ణ, పూజా రామచంద్రన్ అద్భుతమైన నటనను కనబరిచారని దర్శకురాలు పేర్కొంది. ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని పూజా రామచంద్రన్ తెలిపింది. నిర్మాణపరంగా మంచి క్వాలిటీతో తెరకెక్కించామని చిత్ర నిర్మాత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.