Kubera | ‘రాయన్’తో నటుడిగా ప్రశంసలందుకుంటున్నారు హీరో ధనుష్. ఆయన రాబోతున్న మరో పాన్ఇండియా సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకుడు. నాగార్జున ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. నేడు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ధనుష్ పాత్రకు సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘కుబేర’ అనే టైటిల్‌కీ.. విడుదల చేసిన లుక్‌కి సంబంధమే లేదని చెప్పాలి.
మాసిన గడ్డంతో, బికారిగా పోస్టర్లో కనిపిస్తున్నారు ధనుష్. నటుడిగా ధనుష్‌ని మరోస్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు.