Dhanush | స్వీయ దర్శకత్వంలో తమిళ అగ్ర హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘రాయన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ధనుష్ కెరీర్లో 50వ చిత్రమిది కావడం విశేషం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. గత జూలైలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
సోమవారం విడుదల చేసిన పోస్టర్లో ధనుష్ మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్‌కిషన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘పా పాండీ’ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన 50వ చిత్రం కో సం ధనుష్ పూర్తి వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకున్నారని, ఆయన పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.