Raayan | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ యాక్టర్లలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఒకడు. ఓ వైపు శేఖర్ కమ్మల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. మరోవైపు స్వీయ దర్శకత్వంలో ధనుష్ కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ రాయన్ (Raayan). నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జులై 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ మరో లుక్ విడుదల చేశారు. రాయన్‌లో కీ రోల్లో నటిస్తోన్న ఎస్జే సూర్య, హీరో ధనుష్ పోరుకు సై అంటోన్న స్టన్నింగ్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. రాయన్‌లో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డీ50వ (D50)గా వస్తోన్న రాయన్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్డేట్ బయటకు వచ్చింది. రాయన్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర చిత్రీకరణ దశలో ఉంది.
రాయన్ నయా లుక్ వైరల్..
Get ready to witness this epic face-off 🔥#Raayan in cinemas from July 26 🙌🏼@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan @omdop @editor_prasanna @PeterHeinOffl @jacki_art… pic.twitter.com/xHNWuSJpmJ
— Sun Pictures (@sunpictures) June 25, 2024