Dhanush | రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పరిమితం కాకుండా, ఎప్పటికప్పుడు కొత్త కథలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న తమిళ స్టార్ ధనుష్ మరోసారి వార్తల్లో నిలిచారు. కథల ఎంపికలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను కొనసాగిస్తున్న ధనుష్, గత ఏడాది మూడు భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు.గత ఏడాది తెలుగులో ‘కుబేరా’, తమిళంలో ‘ఇడ్లీ కడాయ్’, హిందీలో ‘తేరే ఇష్క్ మేన్’ చిత్రాల్లో నటించిన ధనుష్, ఈ మూడింటిలో ‘ఇడ్లీ కడాయ్’ మినహా మిగిలిన రెండు సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఈ విజయాలతో మరోసారి తన మార్కెట్‌ను మరింత పెంచుకున్న ఈ హీరో, ఇప్పుడు మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆ సినిమానే ‘కర’. ‘పోర్ తోజిల్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా సంక్రాంతి కానుకగా మేకర్స్ టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. విడుదలైన టీజర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ ఇప్పటివరకు చేయని కొత్త రోల్లో కనిపించనున్నాడని టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. మట్టి వాసనతో కూడిన కథనం, పవర్ఫుల్ ప్రెజెన్స్‌తో ధనుష్ కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. కథ, పాత్ర పరంగా ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉండబోతోందనే సంకేతాలు టీజర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘కర’ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ఈ సినిమా ధనుష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగే కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను ఈసారి కూడా ధనుష్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.