Dhanush | శేఖర్‌కమ్ముల, ధనుష్ (Dhanush) కాంబోలో సినిమా వస్తుందని తెలిసిందే. ఈ చిత్రం గతేడాది హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రేపు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. తాజా అప్డేట్తో ధనుష్, రష్మిక మందన్నా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో స్పెషల్ సెట్ కూడా వేస్తున్నారని ఇప్పటికే ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. కథానుగుణంగా ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సోషల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రష్మిక ఇటీవలే హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు బ్రేక్ తీసుకొని జపాన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన విషయం తెలిసిందే. DNS తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. లవ్స్టోరీలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల (Shekhar Kammula) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉన్నాయి.
కాగా ధనుష్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తున్నాడని కోలీవుడ్ సర్కిల్ టాక్.
#DNS Title & FirstLook to be out on March 8th 4:05pm
Dhanush – Nagarjuna
A film by Sekar Kammula pic.twitter.com/vmTdCkZ6pL
— Karthik Ravivarma (@Karthikravivarm) March 7, 2024
DNS షూటింగ్ లొకేషన్ ఫొటోలు..
A blockbuster voyage that’s bound to resonate with the nation! 😎#DNS kicks off with a pooja ceremony and the shoot begins with a key schedule 🎥
More details on the way ⏳@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP pic.twitter.com/bYBtyuwfGA
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 18, 2024
3Minitues To Go #D51 #DNS 🔥🔥@dhanushkraja pic.twitter.com/GF1eAXmY4D
— ANANDH DHANUSH VERIYAN (@DhanushianV) January 18, 2024
Buzz about #D50:
• #SJSuryah & #SundeepKishan signed on to portray the role of brothers alongside #Dhanush 🤯🤩
• #VishnuVishal, #DusharaVijayan & #Kalidas undertaking pivotal roles 👏🏻
• The film is set against the backdrop of North Madras 🔥
• Direction: #Dhanush |… pic.twitter.com/FTlh7Ybcv4
— KARTHIK DP (@dp_karthik) May 24, 2023