Dhanush – Mari Selvaraj | తమిళ నటుడు ధనుష్ (Dhanush) కొత్త సినిమాను ప్రకటించాడు. తనకు కర్ణన్(Karnan) వంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు మారి సెల్వరాజ్(Mari Selvaraj)తో మరో సినిమా చేయబోతున్నాడు ధనుష్. ధనుష్ కెరీర్లో 56వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ధనుష్ గత కొన్ని రోజులుగా నటనకు దూరంగా ఉండి దర్శకత్వం వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే.
గతేడాది రాయన్(Raayan)తో పాటు ఇటీవల జాబిలమ్మ నీకు అంత కోపమా(Jabilamma Neeku Antha Kopama).. సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఇడ్లీ కడై(Idli Kadai) అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదే కాకుండా శేఖర్ కమ్ములతో కుబేరా(Kubera) అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం మారి సెల్వరాజ్‌తో సినిమా చేయబోతున్నాడు ధనుష్. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా పంచుకున్నాడు.
‘మూలాలు గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి'(Roots Begin A Great War) అంటూ మనిషి పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. కాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
#D56 Roots begin a Great War
A @mari_selvaraj film pic.twitter.com/3yfhd6B2pZ— Dhanush (@dhanushkraja) April 9, 2025