Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న డీ50వ (D50). ఈ చిత్రానికి రాయన్ (Raayan) టైటిల్ ఫైనల్ చేశారు. ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా చిత్రయూనిట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. నా విజన్‌ను సపోర్ట్ చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధిమారన్ సార్‌కు కృతజ్ఞతలు.. అంటూ రాయన్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా తెలియజేశాడు.
ఈ మూవీలో ధనుష్ పవర్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడని ఫస్ట్ లుక్‌తో అర్థమైపోతుంది. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. రాయన్‌లో బుట్టబొమ్మ ఫేం అనిఖా సురేంద్రన్ హీరోయిన్గా నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అనిఖా సురేంద్రన్ ఈ సారి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో కనిపించబోతున్నదని పోస్టర్‌తో అర్థమవుతోంది.
#Dhanush‘s #Raayan planning for JUNE 7th Pan India release 💥
Teaser expected on Apr 14th as Tamil New year special ✌️Seems it will be the Next immediate Bigge coming from Kollywood 🤞🔥 pic.twitter.com/9XSDe30bSL
— heyopinions (@heyopinions) April 4, 2024
#D50 #DD2wrapped. My sincere thanks to the entire crew and cast. Also a big thanks to Kalanithi Maran sir and Sun Pictures for supporting my vision.
— Dhanush (@dhanushkraja) December 14, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..