Raayan Movie | కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం ధనుష్ తన 50వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పేరు రాయన్ (Raayan). ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా.. మటన్ కొట్టు రాయన్గా ధనుష్ లుక్ వైరల్ అయ్యింది. ఇక ఇదే పోస్టర్లో సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కూడా ఉన్నారు.
అయితే ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎ. ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள்!🌟 #Raayan first single coming soon!💫@dhanushkraja @sunpictures @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan @omdop @editor_prasanna… pic.twitter.com/IZMWAZK6kM
— A.R.Rahman (@arrahman) April 14, 2024