Dhanush – Mrunal | సినీ ఇండస్ట్రీలో గాసిప్స్, రూమర్లు ఎప్పుడూ కామన్. స్టార్ హీరోలు, హీరోయిన్లు కలిసి కనిపిస్తే చాలు… వాళ్ల మధ్య “సమ్‌థింగ్ స్పెషల్” అంటూ వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్నిటి వెనుక నిజం ఉన్నా, మరికొన్నింటికి అసలు తల తోకే ఉండదు. కొద్ది రోజులుగా తమిళ మీడియాను కుదిపేసిన ఓ రూమర్ కి స్టార్ హీరో ధనుష్ ,బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కేంద్ర బిందువుగా మారారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్, 18 ఏళ్ల వివాహ జీవితానికి బ్రేక్ ఇచ్చారు. ఇద్దరు పిల్లల తండ్రైన ఆయన, ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ధనుష్ వ్యక్తిగత జీవితం గురించి రకరకాల రూమర్లు వెల్లువెత్తుతున్నాయి.
కొద్ది రోజులుగా మృణాల్ ఠాకూర్‌తో ధనుష్ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు తెగ హల్చల్ చేశాయి. మృణాల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రమోషన్ ఈవెంట్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా హాజరవడం, అలాగే మృణాల్ నటించిన మరో సినిమా ‘మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి కూడా ఆయన రావడంతో రూమర్లకు బలం చేకూరింది. ఈ మధ్య ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారు… వారి మధ్య కొత్త రిలేషన్ మొదలైందా? అనే చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తలు ఊహించని స్థాయిలో వైరల్ కావడంతో, మృణాల్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్ .. “ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. మా గురించి వచ్చిన రూమర్లు నన్ను నవ్వించాయి. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కి ఆయన హాజరయ్యారు కాబట్టి మా మధ్య రిలేషన్ క్రియేట్ చేస్తారా? ఆయనకు అజయ్ దేవగన్ సన్నిహితుడు, ఆయన ఆహ్వానంతోనే ఈవెంట్‌కి వచ్చారు. దయచేసి తప్పుగా ఆలోచించకండి అని క్లారిటీ ఇచ్చింది మృణాల్. ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన ఈ స్పష్టతతో ధనుష్ – మృణాల్ మధ్య ఉన్న డేటింగ్ రూమర్స్‌కు పులిస్టాప్ పడ్టట్టే అని అందరు అనుకుంటున్నారు. మరి ఇప్పటికైన ఈ పుకార్లకి చెక్ పడతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.