Cinema News | అక్కినేని నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు కలిసి నిర్మిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘కుబేర’ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ధనప్రదాత కుబేరుడి పేరు టైటిల్‌గా పెట్టి, ధనుష్‌ను మాత్రం ఫస్ట్‌లుక్‌లో బిచ్చగాడిలా చూపించడం ఇక్కడ వైవిద్యమైన అంశం. ధనుష్ నేపథ్యంలో అన్నపూర్ణాదేవి నుండి శివుడు భిక్ష తీసుకుంటున్న చిత్రం కనిపిస్తున్నది.
టైటిల్‌కి భిన్నంగా ధనుష్ పాత్రను పరిచయం చేసి ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు శేఖర్‌కమ్ముల. ఇక నాగార్జున పాత్ర ఎలా ఉండబోతున్నదో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే నాగార్జున పాత్రకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి.