తమిళ అగ్ర హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించి, ఆకాష్ భాస్కరన్‌తో కలిసి నిర్మించిన తమిళ సినిమా ‘ఇడ్లీ కడై’. ఈ సినిమా.. ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో అక్టోబర్ 1న తెలుగులో విడుదల కానుంది. శ్రీ వేదక్షర మూవీస్ పతాకంపై నిర్మాత రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడిగా ధనుష్ నాలుగో సినిమా ఇది. ఈ సినిమా గురించి నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ ‘తెలుగు రైట్స్ మాకిచ్చినందుకు ధనుష్గారికీ, ఆయన టీమ్‌కు కృతజ్ఞతలు.
తెలుగు నేలపై ధనుష్ కెరీర్లోనే హైయ్యస్ట్ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం.’ అని తెలిపారు. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్.