D50 | వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). ఈ స్టార్ హీరో ఇప్పటికే అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) చేస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు హీరోగా, సింగర్‌గా అభిమానులను ఎంటర్టైన్ చేసిన ధనుష్ ఈ సారి తనలోని దర్శకుడిని కూడా పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు. స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ అందించాడు.
D50 షూటింగ్ నేడు షురూ అయింది. షూటింగ్ అప్డేట్ ఇస్తూ లాంఛ్ చేసిన లుక్‌లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తున్నాడు. ధనుష్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సందీప్ కిషన్ ఈ మూవీలో ధనుష్‌కు సోదరుడిగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాళిదాస్, దుషారా విజయన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
ధనుష్ హిందీలో Tere Ishk Meinలో నటిస్తున్నాడు. దీంతోపాటు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
ఇదిలా ఉంటే కెప్టెన్ మిల్లర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ఈ ఏడాది చివరలో విడుదలవఉన్నట్టు సమాచారం.
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023