Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో జోష్ నింపే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న D40 ప్రాజెక్ట్ CDP మోషన్ పోస్టర్‌ను జులై 27న లాంఛ్ చేయబోతున్నట్టు ఓ అప్డేట్ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు పార్టులుగా రానుందని టాక్. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) కీలక పాత్ర పోషిస్తుండగా.. సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు ఇన్సైడ్ టాక్.
Much awaited #D40 Common DP Releasing on July 27th 7PM ( Design by @Debore_ )
CDP Motion Poster Releasing on
July 27th 8PMVFX @NavinKumar9361
BGM score by @pradeepiano88 #CaptainMilIer @dhanushkraja @theSreyas @B_RAJA_ @DirectorS_Shiva https://t.co/7yOd3lmxUZ
— Chowdrey (@Chowdrey_) July 23, 2023