Captain Miller | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు చేసే యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). క్లాస్, మాస్, యాక్షన్.. ఇలా ఏ జోనర్‌లోనైనా ఇట్టే ఒదిగిపోయే టాలెంటెడ్ ధనుష్ సొంతం. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీ కోసం లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఎవరూ గుర్తు పట్టలేని లుక్‌లోకి మారిపోయాడు.
ఇవాళ ముంబై ఎయిర్‌పోర్టులో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని షాకింగ్ లుక్‌లో కనిపించి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. న్యూ లుక్‌లో ఉన్న ధనుష్‌తో ఎయిర్‌పోర్టు స్టాఫ్, ఫ్యాసెంజర్స్ ధనుష్ సెల్ఫీ దిగారు. ఇప్పుడీ స్టిల్స్, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని లీడింగ్ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కెప్టెన్ మిల్లర్‌ను ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ముంబై ఎయిర్‌పోర్టులో ధనుష్..
The Lion entry 🚫
KILLER KILLER CAPTAINMILLER 💥 #CaptainMiller @dhanushkraja@ArunMatheswaran @gvprakash @priyankaamohan @sundeepkishan @B_RAJA_ pic.twitter.com/wlOhNsLX2t
— Sathya Jyothi Flims (@SathyaJyothi_) May 29, 2023