Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ నుంచి ఫస్ట్ సింగిల్ లోడింగ్ అవుతోంది.. అంటూ క్రేజీ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. త్వరలోనే మొదటి పాటను లాంఛ్ చేయనున్నారు మేకర్స్. కామ్రేడ్ అవతార్‌లో కనిపిస్తూ.. సమరానికి అందరినీ మేల్కొలుపుతున్నట్టుగా ఉన్న లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీ మూడు పార్టులుగా రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుండగా.. దీనిపై మేకర్స్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar), టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది.
Much expected #CaptainMiller First Single Arriving soon🎵🤩#Dhanush on his Insta Post – “STAY CALM AND WAIT FOR THE MUSIC TO BEGIN” 🔥🔥 pic.twitter.com/hkPM12IJiN
— AmuthaBharathi (@CinemaWithAB) October 24, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..