Dhanush | తమిళ కథానాయకుడు ధనుష్ తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. మొన్నామధ్య వెంకీ అట్లూరితో ‘సార్’ చేశారు. పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం శేఖర్‌కమ్ములతో ‘కుబేర’ చేస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా మరో తెలుగు దర్శకుడికి ఆయన ఓకే చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ దర్శకుడి పేరు కిశోర్ బి.
ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. యువదర్శకుడు కిశోర్ ఇటీవలే సామాజిక అంశంతో కూడుకున్న ఓ కథను దిల్‌రాజుకు చెప్పగా, ధనుష్‌కి ఈ కథ కరెక్ట్‌గా ఉంటుందని దిల్‌రాజు భావించి, ధనుష్ వద్దకు ఈ కథను తీసుకెళ్లడం, ఆయనకు కూడా నచ్చడం జరిగిందని తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సివుంది.