Dhanush | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్న అతికొద్ది మంది స్టార్ హీరోల్లో ఒకడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush). రాయన్ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ నటుడు ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ధనుష్ ఖాతాలో కుబేర, ఇడ్లీ కడై సినిమాతోపాటు తేరే ఇష్క్ మే (Tere ishk mein) సినిమాలున్నాయని తెలిసిందే.
వీటిలో కుబేర, ఇడ్లీ కడై షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ఓ వైపు షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు హిందీ సినిమా పనులపై కూడా ఫోకస్ పెడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. అయితే వర్షం కారణంగా ఇడ్లీ కడై షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ గ్యాప్‌లోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యాడు ధనుష్. ఇంతకీ ఢిల్లీ టూర్ వెనుక సీక్రెట్ ఏంటనుకుంటున్నారా..? రాంజానా, అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో చేస్తున్న తేరే ఇష్క్ మే పనుల్లో భాగంగానే ఢిల్లీకి వెళ్లాడని బీటౌన్ సర్కిల్ సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలపై ఆనంద్ ఎల్ రాయ్‌తో చర్చించాడట ధనుష్. ఈ లెక్కన ఇప్పటికే బిజీగా ఉన్న ధనుష్.. త్వరలోనే మరో సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టబోతున్నాడని అర్థమవుతుంది. ఇడ్లీ కడై చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆకాశ్ (డెబ్యూ) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న కుబేరలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Dhanush Recent Photo : She’s Charm ✨#Dhanush #idlykadai pic.twitter.com/nq4qhMtllk
— Natshathiram Media (@natshathiram) December 2, 2024
.@dhanushkraja spotted at Delhi airport after a meeting with @aanandlrai ahead of the #TereIshkMein shoot.
Balancing Multiple projects as both actor and director is just wow! 💥✍️#Kubera #IdlyKadai #tereishqmein #NEEK #Dhanush pic.twitter.com/hI9KCY7dQg
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) December 2, 2024
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Harish Shankar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షోలే డైరెక్టర్‌తో హరీష్ శంకర్