Dhanush-Aanand L Rai Movie | తమిళ హీరోల్లో ధనుష్‌కు కూడా తెలుగులో మంచి పాపులారిటీయే ఉంది. ఆయన సినిమాలో ఓ భారీ రేంజ్లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్ఫార్మ్ చేస్తాయి. ఇక కెరీర్ ప్రారంభం నుంచే ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ అడపా దడపా రిలీజవుతూ వచ్చాయి. అయితే ఎనిమిదేళ్ల క్రీతం వచ్చిన రఘువరన్ B-Techతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి. ఇక ఇటీవలే సార్‌తో వంద కోట్ల మార్క్‌ను అవలీలగా కొట్టేశాడు. ప్రస్తుతం ధనుష్ కేప్టెన్ మిల్లర్ సినిమా చేస్తున్నాడు. అరుణ్ మతేశ్వరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత ధనుష్ ఆనంద్ ఎల్రాయ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఏయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. దీనికే లవ్ టచప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం అత్యంత ఖర్చుతో ఏయిర్‌ఫోర్స్ సెట్‌ను రూపొందిస్తున్నారట. ఇక ధనుష్‌కు జోడీగా బాలీవుడ్ తారను ఎంపిక చేసే ప్లాన్‌లో ఉన్నారట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానుందట. గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన అత్రంగీ రే సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.