Dhanashree Verma Telugu Entry | భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ త్వరలో టాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా.
ఈ సినిమాకు శశికుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. కొరియోగ్రాఫర్ యష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించబోతుండగా.. మలయాళ నటి కార్తీక మురళీధరన్ కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ధనశ్రీ వర్మ. యుజ్వేంద్ర చాహల్‌తో విడాకుల అనంతరం కెరీర్‌పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తుంది ఇందులో భాగంగానే ఆకాశం దాటి వస్తావా సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇందులో ధనశ్రీ డ్యాన్సర్‌గా కనిపించబోతుంది.