Dhanashree Verma | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal)తో ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీకి భరణం కింద రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. ఈ మొత్తంలో ఇందులో రూ. 2.37 కోట్లు చెల్లించాడు కూడా. కాగా, దంత వైద్యురాలైన ధనశ్రీ వర్మను 2020 డిసెంబర్ 22న చాహల్ పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ.
ఇదిలావుంటే చాహల్‌తో విడిపోయిన కొద్ది గంటల్లోనే కొత్త ఆల్బమ్‌ను విడుదల చేసింది ధనశ్రీ వర్మ. తన తాజా మ్యూజిక్ వీడియో దేఖా జీ దేఖా మైనే (Dekha Ji Dekha Maine) ఆల్బమ్‌ను టీ-సిరీస్ యూట్యూబ్ ఛానల్ మార్చి 20న విడుదల చేసింది. ఈ పాట చూస్తే.. రాజ కుటుంబంలోకి కోడలిగా వెళ్లిన ధనశ్రీ అక్కడ తన భర్తతో గృహ హింస(Domestic Violence)తో పాటు శారీరక, మానసిక హింసను ఎదుర్కోంటున్నట్లు చూపించారు మేకర్స్. భర్తతో విసిగిపోయిన ఆ యువతి చివరికి అతడిని వదిలిపెట్టి స్వేచ్ఛగా బయటకి వెళుతున్నట్లు ఆల్బమ్‌లో ఉంది. అయితే ఈ వీడియో ధనశ్రీ వర్మ నిజ జీవితానికి దగ్గరగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ పాటను విమర్శిస్తూ.. విడాకుల రోజున ఇలాంటి పాటను విడుదల చేయడం ఉద్దేశపూర్వకంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.